Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షారుక్ ఖాన్, గౌరి బెస్ట్ ఫ్రెండ్స్ అట

పెళ్లి చేసుకున్నా, ఇప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నవారిలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, అతని భార్య గౌరి తొలి స్థానంలో నిలిచారు. కేవలం బాలీవుడ్ నటీనటులను తీసుకుని మాట్రిమోనియల్ వెబ్ సైట్ నిర్వంచిన ఈ సర్వేలో షారుక్ ఖాన్, గౌరీకి 45.3 శాతం మంది పట్టం కట్టారు. 1991లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఆర్యన్, సుహానా, అబ్రం ఖాన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. తర్వాత స్థానంలో మాధురీ దీక్షిత్, భర్త శ్రీరామ్ నేనే 32.3 శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. 22.5 ఓట్లతో మూడవ స్థానంలో దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్, భార్య అధునా ఉన్నారు.

ఇదే సర్వేలో తల్లి-కొడుకు మధ్య స్నేహం కేటగిరీలో హీరో రణ్ బీర్ కపూర్, తల్లి నీతూసింగ్ అత్యధికంగా 63.7 శాతం ఓటింగును సంపాదించుకున్నారు. ఇక హీరోయిన్ సోనాక్షి సిన్హా, నటుడు, రాజీకీయ నేత శత్రుఘ్నసిన్హా.. తండ్రి-కూతురు కేటగిరీలో 38.9 శాతం ఓటింగుతో నిలిచారు. తండ్రి-కొడుకు కేటగిరిలో సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ 53.8 శాతం ఓటింగును దక్కించుకున్నారు. అన్నదమ్ముళ్ల కేటగిరీలో సల్మాన్, అర్భాజ్, సోహైల్ ఖాన్ లు 69.6 శాతంతో ఉంటే.. అక్కాచెల్లెళ్ల కేటగిరీలో కరిష్మా,కరీనా కపూర్ లు 38.4 శాతం ఓటింగుతో నిలిచారు.

More Telugu News